New Branch Opened @Financial District

Dental tips

జన్మతః సిద్ధించిన అవ యవాలన్నీ ఆజన్మాతం ఉండగలిగితే సంతోషమే. కానీ, కొన్ని అవయవాలు అలా ఉండవు. దంతాల విషయంలో అయితే, చాలా మందిలో అవి నడివయసులోనే రాలిపోతుంటాయి. అయితే ఊడిన దంతాల స్థానంలో ‘డెంటల్‌ ఇంప్లాంట్స్‌’ అమర్చుకోవచ్చు. ఇంప్లాంటేషన్‌ విధానం సహాయంతో వయసు మీరినా ‘వజ్రదంతులు’గా వెలిగిపోవచ్చు!
 
‘‘ఒళ్లు బాగుండాలంటే, పళ్లు బాగుండాలి’’ అంటూ ఉంటారు. శరీరంలోకెల్లా అత్యంత దృఢమైనవే అయినా వివిధ కారణాల వల్ల దంతాలు మధ్యలోనే ఊడిపోతుంటాయి. దంతాలు పోతే పోయాయులే అనుకుని కొందరు జీవితాంతం అలాగే ఉండిపోతే, కొందరు డెంచర్లు వాడతారు. వీటిని రోజూ తీసి పెట్టుకోవడం ఒక సమస్య అయితే, ఆహారం నమలడం వల్ల పడే ఒత్తిడి వల్ల చిగుర్లు, దవడ ఎముక అరిగిపోయి ఓ ఐదేళ్లల్లో డెంచర్లు నిలబడలేని స్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలన్నింటికీ విరుగుడుగా జీవితకాలమంతా ఉండిపోయే ఇంప్లాంటేషన్‌ విధానం వచ్చింది..
 
పళ్లు ఊడిపోవడాని కన్నా ముందు అటూ ఇటూ ఊగుతూ చాలా రోజుల దాకా నానా ఇబ్బంది పెడుతుంటాయి. అంతకన్నా ఆ ఊగే పళ్లను తీయించేసి, కృత్రిమ దంతాలను ఇంప్లాంట్‌ చేయించుకుంటే ఎంతో సుఖం. కానీ, ఎంత బాధనైనా భరిస్తూ, పళ్లు వాటికవే ఊడిపోవాలని చూస్తుంటారు. అలా ముందే తీయించేస్తే, కళ్లు దెబ్బ తింటాయన్న భావన ఉంది.అదే నిజమైతే ప్రపంచవ్యాప్తంగా పళ్లు తీయించుకున్న కొన్ని కోట్ల మంది కళ్లు పాడైపోయి ఉండాలి. ఎందుకంటే రోజుకు కొన్ని లక్షల మంది పళ్లు తీయించుకుంటూ ఉంటారు. వాళ్లందరి కళ్లూ ఆరోగ్యంగానే ఉన్నాయి మరి! వాస్తవానికి కన్ను ఆప్టిక్‌ నరానికి సంబంధించినది. పన్ను ట్రైజెమినల్‌ నరానికి సంబంధించినది. అంటే ఏమిటి? కంటికీ, పంటి కీ ఏ సంబంధమూ లేదనే కదా!
 
ఒకప్పటిలా కాదు…
ఒకప్పుడు ఇంప్లాంటేషన్‌ ప్రక్రియతో మూడు నాలుగు పళ్లను మాత్రమే బిగించేవారు. ఇప్పుడు మొత్తం 32 పళ్ళూ బిగించే స్థాయికి దంత విజ్ఞాన శాస్త్రం ఎదిగింది. ఇంప్లాంటేషన్‌ తర్వాత యువతీయువకులు ఏం తింటున్నారో! అవన్నీ వీళ్లూ
తినవచ్చు. ఈ పళ్లు అంత దృఢంగా ఉంటాయి. ఇంప్లాంటేషన్‌తో విపరీతమైన నొప్పి కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. నిజానికి, పళ్లు తీయింంచుకుంటే కలిగే నొప్పితో పోలిస్తే, ఇంప్లాంటేషన్‌తో కలిగే నొప్పి చాలా తక్కువ. ఒక వేళ కాస్తో కూస్తో నొప్పి అనిపించినా, ఇంప్లాంటేషన్‌ చేయించుకున్న తర్వాత ఆస్వాదించబోయే జీవితానుభూతి, గడపబోయే జీవన శైలి ముందు అది ఎంత మాత్రం పరిగణనలోకి రాదు. విశేషం ఏమిటంటే, ఇంప్లాంటేషన్‌ వల్ల పంటి సమస్య తొలగిపోవ డమే కాదు, జనరల్‌ హెల్త్‌ కూడా మెరుగవుతుంది.
 
50 తర్వాతేగా…
50 ఏళ్లు దాటిన వాళ్లు ఇంప్లాంటేషన్‌ చేయించుకోకూడదు అనే మాట బాగా ప్రచారంలో ఉంది. కానీ, ఎక్కువ మందికి, 50 ఏళ్లు దాటిన తర్వాతే కదా ఇంప్లాంటేషన్‌ అవసరం ఏర్పడుతుంది. ఇంప్లాంటేషన్‌కు దూరంగా ఉండే వాళ్ల్లు మెత్తమెత్తని ఆహార పదార్థాలకే పరిమితమై, నొప్పి వల్ల తినీ తిననట్లు ఏ కొంచెమో తిని అలా ఉండిపోతారు. దీనివల్ల కండరాలు, ఎముకలు, నరాలు బలహీనపడతాయి. వీళ్లల్లో శక్తి, ఉత్సాహం తగ్గిపోతాయి. ఎదురీదే దృక్పథం పోయి, ప్రతి దానితోనూ రాజీపడిపోతుంటారు. అరిగి, విరిగి, ఊడిపోయిన పళ్లతో తమ సొట్టబడిన ముఖాన్ని చూసుకుని ఇక మా జీవితం అయిపోయిందిలే అనుకోవడం మొదలెడతారు. 50 ఏళ్ల వయసులోనే రూపం 80 ఏళ్ల వారిగా కనిపించడమే ఇందుకు కారణం.
 
 
 
శుభ్రతపై శ్రద్ధ
దవడ ఎముక దృఢంగా ఉంటే, ఇంప్లాంట్‌ సక్సెస్‌ రేటు 98 శాతం దాకా ఉంటుంది. ఒకవేళ ఆ ఎముక కాస్త బలహీనంగా ఉంటే, 92 శాతం సక్సెస్‌ రేటు ఉంటుంది. ఇంప్లాంటేషన్‌ తర్వాత దంతాల శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం కూడా అవసరమే. ఉదయం, రాత్రి డెంటల్‌ క్లీనింగ్‌ చేసుకుంటూ, ప్రతి ఆరుమాసాలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రతిస్తూ ఉంటే, ఇంప్లాంటేషన్లు జీవితకాలమంతా స్థిరంగా, బలంగా ఉంటాయి.
 
ఇంప్లాంట్‌లో ఏం చేస్తారు?
ఇమ్మీడియెట్‌ ఇంప్లాంటేషన్‌, టూ స్టేజెస్‌ ఇంప్లాంటేషన్‌ అని ఇందులో రెండు రకాలు.
  • ఇమ్మీడియేట్‌ విధానంలో అయితే, ఇంప్లాంటేషన్లు వేసి, ఓ వారం రోజుల్లో దంతాలు అమరుస్తాం. ఆ తర్వాత మూడు నెలల దాకా గట్టి పదార్థాలేమీ తినకూడదు. ఆ తర్వాత అన్నీ తినవచ్చు.
  • టూ స్టేజెస్‌ విధానంలో అయితే, ఇంప్లాంట్స్‌ వేసి, మూడునెలల తర్వాత కొలతలు తీసుకుని, వారికి అనుగుణంగా దంతాలు ఇస్తాం. అయితే ఈ మూడు నెలల దాకా డెంచర్లను వాడాల్సి ఉంటుంది.
  •  ఒకప్పుడు దవడ ఎముక తక్కువగా ఉండే వారికి ఇంప్లాంట్లు వేసే వాళ్లం కాదు. దానికి కారణం ఇంతకు ముందు రఫ్‌ సర్పేస్‌ ఇంపాం్లట్స్‌ అని ఉండేవి. ఇంప్లాంట్స్‌ చుట్టూ ఒక నల్లని కోటింగ్‌ ఉండేది. ఈ కోటింగ్‌ ఎక్కడైనా ఒక మి,.మీ రెండు మి. మీ. తగ్గితే ఇంప్లాంట్‌ దెబ్బతినేది.. ఇప్పుడు స్మూత్‌ సర్ఫేస్‌ ఇంప్లాంట్లు స్ర్కూ టైప్‌ డిజైన్‌లో వ చ్చాయి. ఇవి దవడ ఎముక లోపలికి వెళతాయి, దవడ ఎముక తక్కువ మందంతో ఉన్నా, ఈ ఇంప్లాంట్లు లోపలి నిలిచిపోతాయి.
  •  ఇంతకు ముందు ఇంప్లాంట్లను పైపైనే బిగించాల్సి వచ్చేది. ఇప్పుడు గట్టి బాగ మైన కార్టికల్‌ బోన్‌లో అమరుస్తున్నాం. ఒకప్పుడు కోతతో ఓపెన్‌ చేసి, కుట్లు వేయాల్సిన ఇంప్లాంట్స్‌ ఉండేవి. వాటి వల్ల కొంత నొప్పి, వాపు వచ్చేవి. ఇప్పుడు అలా కాదు. మినిమల్‌ ఇన్‌వేసివ్‌ సర్జరీ ద్వారా బాగా అవసరమైన ఆ స్వల్ప భాగంలో మాత్రమే రంధ్రం చేసి, ఇంప్లాంట్స్‌ వేస్తున్నాం.
  • సాధారణంగా ఈ ఇంప్లాంట్స్‌ వేసే ప్రక్రియ అంతా రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుంది. ఒక వేళ ఆ వ్యక్తి బలహీనంగా ఉంటే మూడు నాలుగు రోజుల వ్యవధి తీసుకుని నాలుగేసి ఇంప్లాంట్ల చొప్పున పూర్తి చేస్తాం.
బి.పి., షుగర్‌లు ఉంటే…
బి.పి., షుగర్‌ ఉన్నవాళ్లు కూడా ఇంప్లాంటేషన్‌ చేయించుకోవచ్చు. కాకపోతే ముందుగా, హిమో గ్లోబిన్‌లో ఉండే ఈ హెచ్‌.బి.ఏ 1సి సగటున మూడు మాసాల వ్యవధిలో ఎంత ఉంది అని చూస్తారు. అది 7 లోపల ఉంటే, షుగర్‌ ఎంత ఉన్నా ఇంప్లాంటేషన్‌ చేయవచ్చు. ఒకవేళ హెచ్‌.బి.ఏ 1 సి….. 11 ఉంటే, షుగర్‌ ఎంత తక్కువగా ఉన్నా చెయ్యరు. ఎందుకంటే, ఎముక ఆ మూడుమాసాలు ఆ సగటు అంశానికే ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. ఒకసారి ఇంప్లాంటేషన్‌ జరిగిన తర్వాత షుగర్‌ పెరిగినా, తగ్గినా వచ్చే నష్టమేమీలేదు.

Our Videos

Quick Contact
close slider
Call Now Button